ఆంధ్రప్రదేశ్‌

భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 17: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం సోమవారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది. ఇది మంగళవారం నాటికి వాయుగుండగా మారనుంది. దీని ప్రభావం వలన వచ్చే 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురియనున్నాయి. అలాగే గంటకు 50 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలు వీస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమ్తతంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో రెవెన్యూ, పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు.