ఆంధ్రప్రదేశ్‌

వరదను ఒడిసిపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: వర్షాకాలంలో నీరు దాచుకునే విధానాలను అనుసరించకపోతే ఎంత భారీ వర్షాలు కురిసినా వృథాయేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికపైన వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేపట్టాలన్నారు. సోమవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు సమీక్షా సమావేశంతో పాటుగా ‘నీరు- ప్రగతి’పై అధికారులతో వీడియో, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు వాననీటిని ఒడిసిపట్టే బాధ్యత తీసుకోవాలన్నారు. వ్యవసాయ, జలవనరుల శాఖ అధికారులు శాస్ర్తియంగా కృషిచేసి ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థుల సహాయం తీసుకుని ఫలితాలు సాధించాలన్నారు. సంక్షోభం వచ్చినప్పుడు వెతుక్కోకుండా సంక్షోభాన్ని అధిగమించేందుకు పనిచేస్తున్నామన్న విషయం ప్రతి ఒక్క అధికారి గుర్తుంచుకోవాలని ఆదేశించారు. ‘వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. గోదావరి, కృష్ణా డెల్టాలకు ఒకేసారి సాగునీరు అందిస్తున్నాం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసి ఎక్కడా ఏ ఇబ్బందీ లేకుండా చూడాలి’ అని అన్నారు. ప్రతి క్షేత్రానికి సూక్ష్మపోషకాలు అందేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్ నుంచి ఎటువంటి ప్రవాహం లేకపోయినా కృష్ణాడెల్టాకు సాగునీరు ఇవ్వగలుగుతున్నామంటే అది పట్టిసీమ పుణ్యమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తుపాన్లకు ముందే ఈసారి పంట చేతికి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా డెల్టాలకు ఒకేసారి నీళ్లు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు.
నాగావళిపై అప్రమత్తంగా ఉండాలి
నాగావళికి వరదనీరు ఉద్ధృతంగా వస్తోందని, అధికారులు ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. తోటపల్లి, గొట్టా బ్యారెజ్‌ల నుంచి వంశధార ఆయకట్టుకు ఈ నీరు అందిస్తున్నామని జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ ముఖ్యమంత్రికి చెప్పారు. రాయలసీమలో 10 శాతం తక్కువగా వర్షపాతం ఉన్నదని, కోస్తాలో 10 శాతం ఎక్కువగా ఉందని అధికారులు వివరించారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా 100 మీటర్ల అడుగున నీరుండే పరిస్థితులు ఉన్నాయన్నారు. గత ఏడాది రెయిన్ గన్లు ఉపయోగించి పంటలు కాపాడామని, ఈ ఏడు దిగుబడులు పెంచేందుకు తప్పక ప్రయత్నించాలని అన్నారు. అనంతపురం జిల్లాలో ఇ-క్రాప్ బుకింగ్ సంపూర్ణంగా జరగాలని సూచించారు.