ఆంధ్రప్రదేశ్‌

వార్డెన్ ఆస్తులు రూ.13 కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 17: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికార్లు సోదాలు నిర్వహించారు. ఈసందర్భంగా సుమారు రూ.13 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఆస్తులను గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎసిబి డిఎస్పీ వి గోపాలకృష్ణ అందించిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన రావిపాటి అన్నపూర్ణయ్య గత 30 ఏళ్లుగా సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహంలో వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఫిర్యాదులు అందడంతో ఎసిబి అధికారులు రంగంలోకి దిగారు. సోమవారం ఏలూరు తంగెళ్లమూడి నేతాజీనగర్‌లోని అన్నపూర్ణయ్య ఇంట్లో, సత్రంపాడులోని అతని స్నేహితుని ఇంట్లో, తణుకులోని ఆతని బావమరిది ఇంట్లో, మొగల్తూరు, విజయవాడలోని ఆతని వియ్యంకుల ఇళ్లల్లో, హైదరాబాద్‌లో ఉంటున్న అతని కుమారుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్దఎత్తున ఆస్తిపత్రాలు లభ్యమయ్యాయని డిఎస్పీ తెలిపారు. ఆయనకు ఏలూరులో మూడు ఇళ్లు, తణుకులో ఒక ఇల్లు, విజయవాడ రామవరప్పాడు రింగ్‌రోడ్డు వద్ద ఒక ఫ్లాట్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో 2.8ఎకరాల వ్యవసాయక్షేత్రం ఉన్నట్లు గుర్తించారు. డాక్యుమెంటు లెక్కల ప్రకారం అన్నపూర్ణయ్య ఆస్తుల మొత్తం విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని అంచనావేస్తుండగా, మార్కెట్ విలువ మాత్రం దాదాపు రూ.13 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. వీటితోపాటు 20కాసుల బంగారు అభరణాలు, కొద్దిమొత్తంలో నగదు, పలు ప్రామిసరీ నోట్లు లభ్యమయ్యాయని తెలిపారు. అన్నపూర్ణయ్య ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తున్నట్లు తేలిందని వివరించారు. సోదాల్లో ఆస్తిపత్రాలతోపాటు ఒక లాకర్ కీ కూడా లభ్యమైందని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో డిఎస్పీతోపాటు ఎసిబి సిఐలు యుజె విల్సన్, శ్రీనివాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం.. హాస్టల్ వార్డెన్ అన్నపూర్ణయ్యను విచారిస్తున్న ఎసిబి ఇన్‌స్పెక్టర్ విల్సన్