ఆంధ్రప్రదేశ్‌

మున్సిపల్ కమిషనర్లకు బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు రీజనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సి.అనూరాధను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. ఎపిఎండిపి గుంటూరు ఫైనాన్స్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఎవి రమణిని గుంటూరు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్‌గా నియమించారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు ఎంపిడిఓ డివి భాగ్యలక్ష్మిని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ కమిషనర్‌గా డెప్యుటేషన్ ప్రాతిపదికపై నియమించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ జి.సాంబశివరావును తణుకు మున్సిపల్ కమిషనర్‌గా, డిపిఓ ఎన్.ప్రమోద్‌కుమార్‌ను గుడివాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. పురపాలక శాఖ డైరెక్టరేట్‌లో పనిచేస్తున్న టి.రాజగోపాల్ రావును సూళ్ళూరుపేట మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ జి.చంద్రయ్యను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న మున్సిపల్ కమిషనర్ షేక్ మాలిక్‌ను గుంటూరు మున్సిపల్ డైరెక్టరేట్‌కు బదిలీ చేశారు. డిపిఓ ఎన్.ప్రదీప్ కుమార్‌ను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా నియమించారు. పురపాలక శాఖ డైరెక్టరేట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సిహెచ్ శ్రీనివాస్‌ను కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ కమిషనర్‌గా నియమించారు. మున్సిపల్ కమిషనర్ కె.మేరీగోల్డ్ డైమండ్‌ను మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించారు. కందుకూరు మున్సిపల్ కమిషనర్ పి. వెంకటేశ్వరరావును నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు సెక్రటరీగా నియమించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీ ఎం.అంజయ్యను పురపాలక శాఖ డైరెక్టరేట్‌కు బదిలీ చేశారు.