ఆంధ్రప్రదేశ్‌

ఎంపి మేకపాటికి, ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డికి అరెస్టు వారెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు లీగల్, జూలై 18: ఒక కేసుకు సంబంధించి నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, కుమారుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డికి కోర్టు మంగళవారం అరెస్టు వారెంటు జారీ చేశారు. ఒక ప్రైవేట్ కేసులో వీరు ముగ్గురు కోర్టు వాయిదాకు హాజరుకానందున వీరిని అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరచాలని నెల్లూరు రెండవ అదనపు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు చేశారు. వీరి అరెస్టుకై నాన్‌బెయిలబుల్ వారెంటు కూడా జారీ చేయాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు నగరానికి చెందిన కాంట్రాక్టర్ కె సనత్‌కుమార్‌రెడ్డి 2012లో మేకపాటి రాజమోహన్‌రెడ్డికి సంబంధించిన కెఎంసి కనస్ట్రక్షన్ కంపెనీలో సబ్ కాంట్రాక్టర్‌గా చేరి పనులు చేశారు. ఇందుకు గాను మేకపాటికి సంబంధించిన కంపెనీ సబ్‌కాంట్రాక్టర్ అయిన సనత్‌కుమార్‌రెడ్డికి బిల్లులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో సనత్‌కుమార్‌రెడ్డి 2012లో నెల్లూరు రెండవ పట్టణ పోలీసుస్టేషన్‌లో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న గౌతమ్‌రెడ్డి, డైరెక్టర్లుగా ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వారిపై చీటింగ్ కేసును నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు అనంతరం సనత్‌కుమార్‌రెడ్డి సంబంధిత కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈ ముగ్గురు నిందితులపై 2016లో కోర్టు కేసు విచారణకు స్వీకరించింది. కాగా, ఈ కేసు వాయిదా ఈ నెల 14 జరిగింది. కాగా, ఈ వాయిదాకు నిందితులైన రాజమోహన్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి హాజరుకాలేదు. వీరి తరఫున ఎటువంటి విజ్ఞాపన కోర్టులో దాఖలు కాలేదు. దీంతో న్యాయమూర్తి వీరి అరెస్టుకై నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేశారు. దీంతో ఫిర్యాది తరఫున న్యాయవాది వారెంట్ జారీ చేయడానికి గాను కోర్టులో సోమవారం బత్తా మెమో దాఖలు చేశారు. దీనిపై ముగ్గురు నిందితులను వారెంటుపై పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరచాల్సి ఉంది.