ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం అమ్మకానికి ప్రీ-బిడ్ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: ఎర్రచందనం అమ్మకాలకు ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ గ్లోబల్ టెండర్లను పిలిచిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రీ-బిడ్ సమావేశాలు బుధవారం తిరుపతిలో, 21వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పర్యావరణ, అడవులు-శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకృతి విపత్తుల నుంచి మానవాళిని కాపాడే మడ అడవులను పరిరక్షించి, మడ అడవులు ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి అటవీ శాఖకు చెందిన చెక్‌పోస్టులను, స్ట్రైకింగ్ ఫోర్స్‌ను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఫారెస్ట్ బేస్ క్యాంప్స్‌లో పనిచేయడానికి కావలసిన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వనం-మనం కార్యక్రమం గురించి సమీక్షిస్తూ 13 జిల్లాల్లో వనం-మనం కార్యక్రమం అమలవుతున్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మీడియా, గోడ పత్రికల ద్వారా మ్రరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా ఆదేశించారు.పచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రిన్సిపల్ అనంతరాము, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ పి.సారంగి పాల్గొన్నారు.