ఆంధ్రప్రదేశ్‌

బెల్ట్‌షాపులను మూసివేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే పదిరోజుల్లో బెల్ట్‌షాపులను మూసివేయని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా ప్రకటించారు. మంగళవారం ఆమె ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే నెలరోజుల్లో బెల్ట్‌షాపులను మూసివేస్తామన్నారు. నివాసిత ప్రాంతాలకు కూడ మద్యం షాపులు విస్తరించాయని, మద్యం బూతాన్ని తరిమి గొట్టేందుకు వైకాపా ఉద్యమా న్ని చేపడుతుందన్నారు. 2014 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే బెల్ట్‌షాపులను మూసివేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆచరణలో విఫలమయ్యారన్నారు. సంతకం ఫైళ్లకే పరిమితమైందన్నారు. మహిళలకు రాష్ట్రప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందంటూ ప్రచారం తప్ప ఆచరణలో ఏమి లేదన్నారు.