ఆంధ్రప్రదేశ్‌

సెప్టెంబర్‌లో విలేజ్ మాల్స్ ప్రారంభించే యోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: రాష్ట్రంలో సెప్టెంబర్‌లో విలేజ్ మాల్స్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. కేరళ మంత్రి బృందంతో చర్చల అనంతరం ఆయన వెలగపూడి సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ తొలిదశలో 6 వేల విలేజ్ మాల్స్‌ను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రతిపాదన (ఆర్‌ఎఫ్‌పి)లను ఆహ్వానించామని తెలిపారు. వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఖరారు చేస్తామని తెలిపారు. తొలిదశలో మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ మాల్స్‌లో నిత్యావసర సరకులను మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువకు విక్రయిస్తారని తెలిపారు. వీటిపని తీరు పరిశీలించాక, 29 వేల రేషన్ దుకాణాలకు వర్తింప చేస్తామన్నారు. సెప్టెంబర్ నుంచి రేషన్ దుకాణాల ద్వారా పంచదార సరఫరా చేసేందుకు ప్రతిపాదిస్తున్నామని, ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వివిధ థియేటర్లలో సెలక్ట్ చానల్ పేరుతో బహుళ జాతి కంపెనీలు ప్రేక్షకులను దోచుకుంటున్నాయని విమర్శించారు. ప్రి-ప్యాక్డ్ వస్తువులపై ముద్రించిన ధరకే విక్రయించాలని, రెండు రకాల ధరలు ఉండకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, థియేటర్లను సీజ్ చేస్తామన్నారు.