ఆంధ్రప్రదేశ్‌

విజయవాడ-మచిలీపట్నం రహదారి పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ-మచిలీపట్నం మధ్య చేపట్టిన నాలుగు లైన్ల రహదారి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖాధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ నేషనల్ హైవే 65పై విజయవాడ - మచిలీపట్నం మధ్య చేపట్టన నాలుగు లైన్ల రహదారుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైవస్ కెనాల్‌పై చేపట్టిన వంతెనల నిర్మాణాల విషయంలో తలెత్తుతున్న సమస్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సిఎస్ దృష్టికి ఆర్ అండ్ బి, ఇరిగేషన్ శాఖాధికారులు తీసుకెళ్లారు. రైవస్ కెనాల్ పై నిర్మించతలపెట్టిన రెండు వంతెనల నిర్మాణంలో చోటు చేసుకుంటున్న సమస్యలను శీఘ్రగతిన పరిష్కరించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యంలోగా ఈ నాలుగు లైన్ల రహదారుల పనులు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ట్రాన్స్‌పోర్టు, ఆర్ అండ్ బి ప్రిన్సిపాల్ సెక్రటరీ సుమితా దావ్రా, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్, కృష్ణాజిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, నేషనల్ హైవే విజయవాడ ఆర్‌ఓ అనిల్ దీక్షిత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.