ఆంధ్రప్రదేశ్‌

ఎసిబి వలలో తుడా పిఓ కృష్ణారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 20: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో గురువారం తుడా (తిరుపతి అర్బన్ డవలప్‌మెంట్ అధారిటీ) ప్రణాళిక విభాగంలో పనిచేసే కృష్ణారెడ్డిపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో ఆయన ఇంటిపై, బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. తుడా కార్యాలయంలో ప్రణాళిక విభాగం అధికారిగా పనిచేస్తున్న కృష్ణారెడ్డి ఏ పనికైనా లంచం అడుగుతున్నారని ఎసిబి అధికారులకు సమాచారం అందడంతో ఆయన నివాసం ఉంటున్న రామచంద్రా నగర్‌లోని ఇంటిపై, ఆయన బంధువుల ఇళ్లపై గురువారం ఉదయం ఏసిబి అధికారులు సోదాలు చేశారు. ఆయన ఇంటిలోని బంగారు, వెండి ఆభరణాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇవికాక బ్యాంక్ లాకర్లలో పెద్ద ఎత్తున నగదు, నగలు ఉండవచ్చని భావిస్తున్నారు. తిరుపతి పట్టణంలో రూ.1.24 కోట్లు విలువచేసే జి+2 రెండు ఇళ్ళను, రూ.18.40లక్షలు విలువచేసే అపార్ట్‌మెంట్‌లో ఒక ప్లాట్‌ను, 220 గ్రామలు బంగారు, 2కెజీల వెండి, ఒక ఇన్నోవాకారు, మహేంద్ర కార్లతోపాటు బుల్లెట్ క్లాసిక్ 550, రెండు స్కూటీలు, హీరోహోండా స్ల్పెండర్‌ను గుర్తించారు. కొన్ని లాకర్లను కూడా తెరవాల్సి ఉంది. ఏదేమైనా సుమారు రూ.3కోట్ల విలువచేసే ఆస్తులను కృష్ణారెడ్డి వద్ద గుర్తించామని ఏసిబి అధికారులు చెప్పారు.