ఆంధ్రప్రదేశ్‌

ఫార్మా కంపెనీల భద్రతపై ‘్థర్డ్‌పార్టీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), జూలై 20 : ఫార్మా కంపెనీల్లో భద్రతాప్రమాణాలు, ఆడిటింగ్‌పై ‘్థర్డ్‌పార్టి’ ఏంక్వైరీ ఏర్పాటు చేస్తున్నట్టు కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారయణ పేర్కొన్నారు. విశాఖలో ఔషధ పరిశ్రమ రసాయన భధ్రత, విపత్తునివారణ-సవాళ్లుఅనే అంశంపై గురువారం జరిగిన ముగింపు సదస్సులో మంత్రి మాట్లాడూతూ ఫార్మా కంపెనీల్లో పని చేస్తున్న కార్ముకులకు సరైన శిక్షణ లేక పోవడంతోనే తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయిని, స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులకు తప్పనిసరిగా మొరుగైన శిక్షణ అవసరమని, తర్ఫీదు లేక పోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కంపెనీల ప్రగతితో పాటు, కార్మికుల భద్రత కూడా హెచ్‌ఆర్‌లు ఏప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. పారిశ్రామిక రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని, నిరుద్యోగులకు పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. త్వరలోనే విశాఖ నగరం పారిశ్రామిక హబ్‌గా మారబోతుందన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై కేసులు నమెదు చేస్తామన్నారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది, ఏటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా ఫార్మా కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. విశాఖ జిల్లాలోని ఫార్మా కంపెనీల్లో గత ఏడాది 19 ప్రమాదాలు జరిగితే 16 కంపెనీలపై కేసులు నమోదు చేసామన్నారు. ఫార్మా, ఫైర్, కాలుష్య నియంత్రణ మండలి, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేయాలన్నారు.
కంపెనీలపరంగా వున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారిస్తామన్నారు. కార్యక్రమంలో పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.