ఆంధ్రప్రదేశ్‌

భీమ(త్తు)వరమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 20: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మత్తు మందులు విక్రయించే ముఠాతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి లింకులు ఉన్నట్లు తేలడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పట్టణానికి చెందిన ప్రసాద్ సన్స్ అండ్ కో మెడికల్స్ ద్వారా మత్తు మందులను విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ దుకాణ యజమానిని అరెస్టు చేశారు. దీంతో అప్రమత్తమైన ఔషధ నియంత్రణ శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖాధికారులు హడావుడి చేస్తున్నారు. ఎవరెవరు మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు, ఎవరు వాటిని కొనుగోలు చేస్తున్నారు, అమ్మకాలు జరిగే ప్రాంతాలేమిటి అన్న వివరాలపై ఆరాతీస్తున్నారు. భీమవరం పట్టణంలో కొనే్నళ్లుగా మత్తుమందుల విక్రయ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. ఇప్పటికే సినీ పరిశ్రమలో డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న వారిలో చాలామందికి భీమవరంతో సన్నిహిత సంబంధాలున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన వారు చాలామంది భీమవరం, పరిసర ప్రాంతాలకు విడిదికి వచ్చివెళ్తుంటారు. దీనితో భీమవరం పట్టణంపై అందరి దృష్టి కేంద్రీకృతమయ్యింది. ప్రస్తుతం భీమవరంలో మత్తును కలిగించే టోసెక్స్, కోరక్స్, ఆల్ఫాజోలబ్ వంటి వాటిని ఎక్కువగా విక్రయిస్తున్నట్లు కాకినాడ పోలీసులు జరిపిన విచారణలో తేలింది. రాష్ట్రంలోనే సంపన్న ప్రాంతాల్లో భీమవరం ఒకటి కావడంతో ఇక్కడ మత్తు పదార్థాల విక్రయాలు జోరుగానే సాగుతాయనే ఊహాగానాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాకినాడ ముఠాతో ఇక్కడి మెడికల్ షాపు యజమానికి సంబంధాలున్నట్టు వెల్లడవ్వడంతో మరోసారి భీమవరం వార్తల్లోకి ఎక్కింది.

చిత్రం.. భీమవరంలో టోసెక్స్ మందు విక్రయించే మందుల దుకాణాన్ని మూసివేసిన దృశ్యం