ఆంధ్రప్రదేశ్‌

పిల్లలకు మరోసారి ‘బయోమెట్రిక్’ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: గతంలో నమోదు చేసుకున్నప్పటికీ, పిల్లలకు మరోసారి బయోమెట్రిక్ వివరాల నమోదు తప్పనసరి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ వెల్లడించారు. ఆధార్ అనుసంధానం, నమోదు, తదితర అంశాలపై వెలగపూడి సచివాలయంలో ఆయన శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లల వయసు 5 సంవత్సరాలు దాటిన తరువాత, మళ్లీ 15 సంవత్సరాల వయసు దాటాక బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. రాష్ట్రంలో ఈ విధంగా మరోసారి బయోమెట్రిక్ వివరాలు తిరిగి నమోదు చేయించుకోవాల్సిన వారి సంఖ్య దాదాపు 50 లక్షలని తెలిపారు. ఈ వివరాలను పాఠశాల విద్యా శాఖ అధికారులు నమోదు చేయాలని ఆధార్ అధికారులు కోరారు. గుజరాత్, హర్యానా తదితర రాష్ట్రాల్లో పాఠశాలల్లోనే ఈ వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల సిబ్బందికి బయోమెట్రిక్ నమోదులో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. తపాలా శాఖ ప్రధాన కార్యాలయాల్లో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటుకు ఆ శాఖ ముందుకు వచ్చిందని తెలిపారు. పట్టణాలు సహా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ పుట్టినతేదీ సర్ట్ఫికెట్ తీసుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సిఎస్ ఆదేశించారు.