ఆంధ్రప్రదేశ్‌

భోగాపురం నిర్వాసితులకు నష్టపరిహారం ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: విజయనగరం జిల్లా భోగాపురంలో తలపెట్టిన ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ఇక మార్గం సుగమమైనట్లే. విమానాశ్రయ పరిధిలో భూమి కోల్పోతున్న రైతులకు నష్టపరిహారాన్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. భోగాపురం మండలం రావాడ గ్రామానికి సంబంధించి ఎకరానికి 35 లక్షల రూపాయలు, సవరవిల్లి గ్రామానికి 36 లక్షల రూపాయలు, ఎ.రావివలస గ్రామానికి సంబంధించి 34 లక్షల రూపాయలను చెల్లించేందుకు నిర్ణయించింది. ఆ భూముల్లో ఉన్న ఆస్తులకు నష్టపరిహారం కాకుండా ఎకరాకు ఈ మొత్తం చెల్లించనున్నారు.