ఆంధ్రప్రదేశ్‌

‘వంశధార’కు తొలగిన అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 21: వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి మోకాలడ్డే 40 రిట్ పిటీషన్లపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను వెల్లడించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులు కొత్త భూసేకరణ చట్టం వర్తింపజేయాలంటూ వేసిన రిట్ పిటిషన్లను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 850, 851 రిట్ పిటిషన్ల సంఖ్యతో హైకోర్టులో దాఖాలు చేసింది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు న్యాయమూర్తులతో కలిసిన బెంచ్ విచారణ చేసింది. బెంచ్ అన్ని అంశాలను పరిశీలించిన పిదప పాత భూసేకరణ చట్టం ప్రకారమే వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలంటూ బుధవారం తన ఆదేశాల్లో పేర్కొంది. శుక్రవారం ఇక్కడి కలెక్టరేట్‌కు అందిన హైకోర్టు ఉత్తర్వులపై జాయింట్ కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు ఆంధ్రభూమితో మాట్లాడుతూ ఇప్పటికే 95 శాతం భూసేకరణ, నష్టపరిహారం చెల్లించారన్నారు. 85 శాతం మేరకు రిజర్వాయర్, కాలువలు, స్పిల్ ఓవర్ పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. ఇంత మేర పనులు జరిగిన తర్వాత కొత్త భూసేకరణ చట్టం సరికాదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు బృందం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. భవిష్యత్తులో ఇతర వ్యాజ్యాలు ఉండే అవకాశాలు లేవని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా ప్రజలు ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం తరుఫున అర్హత మేరకు నష్టపరిహారం చెల్లింపుల్లో సత్వర చర్యలు చేపట్టామని చెప్పారు. ఇప్పటి వరకూ ప్రాజెక్టు నిర్మాణానికి గల అడ్డంకులు పూర్తిగా తొలగిపోయినట్టే!