ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడులకు మరింత ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: వివిధ రంగాల్లో వృద్ధి రేటును కొనసాగించేందుకు వీలుగా విజయవాడలో స్ట్రాటజిక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఎపి (సిట్ ఎపి)ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణ కల్పన, ఆర్థికాభివృద్ధికి ఊతం ఇచ్చేలా ఇతర రాష్ట్రాలు, దేశాలతో వివిధ అంశాల్లో పోటీతత్వం పెంపొందిచడం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. వీటిని కొనసాగించేందుకు, భవిష్యత్తులో ఆర్థిక విధానాల రూపకల్పనకు ఏకగవాక్షంగా ఉండేలా సిట్ ఎపిని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రణాళికా విభాగం పరిధిలో ఈ సంస్థ తన కార్యాకలాపాలను వెంటనే ప్రారంభించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా 5 కోట్ల రూపాయలను కేటాయించారు. సంస్థ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, సిబ్బంది, వారి జీతాలు, నియామకాలు, తదితర అంశాలను ఖరారు చేస్తారు.