ఆంధ్రప్రదేశ్‌

పాఠశాలల్లో వౌలిక వసతుల నిర్వహణ ప్రైవేటుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 22: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వౌలిక వసతులను కల్పించడంతోపాటు వాటి పర్యవేక్షణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నట్టు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు తెలిపారు. ఈ మేరకు ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని, త్వరలో వీటికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసే విషయమై కసరత్తు జరుగుతుందన్నారు. ఈ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మూడు దఫాలుగా ప్రైవేటుకు అప్పగించనున్నారు. విద్యార్థులకు మధ్యాహ్నా భోజన పథకం అమలు నుంచి అన్ని రకాల వసతులు కల్పించడం, కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను సమకూర్చే బాధ్యతను ఆ ప్రైవేటు సంస్థ చేపట్టనుందని, ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 6500 ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో తొలి విడతగా అన్ని హైస్కూళ్లలో వౌలిక వసతులను సమకూర్చే బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారు. ఆ తరువాత ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆయా సంస్థలకు అప్పగించనున్నారు. ఇందుకు ఖర్చు అయ్యే మొత్తా న్ని ప్రభుత్వం భరించనుంది. పాఠశాలలు మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఈ పద్ధతి ఎంతో ఉపకరించనుందని పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు.