ఆంధ్రప్రదేశ్‌

పంటపొలాల్లో రైతును తొక్కి చంపిన ఏనుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు, జూలై 22: చేతికొచ్చిన పంటను కాపాడాలన్న తపనతో పొలం వద్ద కాపలా ఉన్న రైతును ఏనుగుల గుంపు తొక్కి చంపాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో శనివారం జరిగింది. పంటలకు నష్టం కలుగచేస్తున్న ఏనుగులను తరిమివేసే ప్రయత్నంలో రైతు ప్రాణాలు కోల్పోయాడు. పలమనేరు మండలంలోని పి. వడ్డూరు గ్రామంలో రైతు చిన్నప్ప(58) పంట పొలాలను ఏనుగుల గుంపును తన పొలంలోకి రాకుండా తరిమే ప్రయత్నం చేశాడు. సుమారు తొమ్మిది ఏనుగులు గుంపు రైతు చిన్నప్పను చుట్టుముట్టి దాడికి పాల్పడి తొక్కి చంపాయి. ప్రొద్దున్న వెళ్లిన చిన్నప్ప ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లగా ఏనుగులు దాడి చేసి చంపినట్లు గుర్తించి బోరున విలపించారు. చిన్నప్ప కుమారుడు హరి గ్రామస్తులకు చెప్పడంతో అటవీశాఖాధికారులకు సమాచారం తెలిపారు. జిల్లా అటవీశాఖాధికారి చక్రపాణి వచ్చి పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత ఆరు నెలలుగా ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని అధికారులకు రైతులు పలుమార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏనుగు గుంపు నుంచి మళ్లీ రైతులకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.