ఆంధ్రప్రదేశ్‌

దేవరపల్లి దళితులకు సర్కారు అండ: జవహర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 22: ప్రకాశం జిల్లా దేవరపల్లిలో ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగించేలా వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ఆరోపించారు. దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవడం సమాజానికి మంచిది కాదని శనివారం ఇక్కడ ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా దేవరపల్లి గ్రామంలో నీరు-చెట్టు పనులను ప్రభుత్వం చేపట్టిందని, వర్షాలే ఆధారంగా సాగుచేయాల్సిన పరిస్థతిని చక్కదిద్దేందుకే నీరు-చెట్టు పథకం కింద చెరువును అభివృద్ధి చేయిస్తున్నామన్నారు. భూములు కోల్పోయిన వారికి అండగా ఉండేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, భూములు, స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. దళితులకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నా దురుద్దేశంతోనే తల్లీ పిల్ల కాంగ్రెస్‌లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. మూడేళ్ల తెలుగుదేశం పార్టీ హయాంలో దళితులకు ఇబ్బంది కలిగించేలా ప్రభుత్వం ఎక్కడా వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్య కులచిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న తల్లీ పిల్ల కాంగ్రెస్‌లు తమ వైఖరి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారంటూ మంత్రి జవహర్ హెచ్చరించారు.