ఆంధ్రప్రదేశ్‌

కాఫర్ డ్యామ్‌తో సరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 22: కాఫర్ డ్యామ్‌తోనే పోలవరం ప్రాజెక్టును సరిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. కాపర్ డ్యామ్ అంటే ప్రధాన డ్యామ్ పనులకు ఆటంకం లేకుండా అడ్డుగా నిర్మించే మట్టికట్ట. దీనినే ప్రభుత్వం ప్రధాన డ్యామ్‌గా వినియోగించి గ్రావిటీ ద్వారా పోలవరం నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం మూడో కాంటూరు అంటే 135 మీటర్లకు పరిమితం చేసి కాఫర్ డ్యామ్‌నే ప్రధాన డ్యామ్‌గా పరిగణించి గ్రావిటీ ద్వారా పోలవరం జలాలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కేవలం ఎన్నికల వ్యూహాత్మకంగా 2019 నాటికి కాఫర్ డ్యామ్ ద్వారా ప్రధాన డ్యామ్ కంటే కాపర్ డ్యామ్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. స్పిల్ వే ద్వారా నీటిని మళ్లించి ప్రధాన ప్రవాహానికి అనుసంధానం చేస్తారు. అసలు డ్యామ్‌కు రెండు వైపులా ఈ డ్యామ్‌లు నిర్మిస్తారు. కాపర్ డ్యామ్‌ను ప్రధాన డ్యామ్ నిర్మాణంలో నీళ్లు అడ్డురాకుండా నిర్మించే తాత్కాలిక మట్టికట్ట. గోదావరి నదికి గరిష్టంగా 30 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. కాఫర్ డ్యామ్‌కు 4 లక్షల క్యూసెక్కుల కూడా తట్టుకునే అవకాశం ఉండదు. కాఫర్ డ్యామ్ నీటిని మళ్లించడానికే తప్ప నీటిని నిల్వ చేయడానికి పనికి రాదు. స్పిల్ వే కాంక్రీటు పనులు డిసెంబర్ 30న ప్రారంభించారు. పోలవరం జలాశయం అదనపు వరద నీటిని స్పిల్ వేల ద్వారా వదిలేందుకు గేట్లు పెడతారు. స్పిల్‌వేకు ఎగువన అప్రోచ్ ఛానల్, దిగువన స్పిల్ ఛానల్ నిర్మిస్తారు. ఈ రెండు నిర్మాణాల తర్వాత పైలెట్ ఛానల్ నిర్మాణం చేపడతారు. స్పిల్ వేను రాతి మట్టికట్ట చివర 1054.40 మీటర్ల పొడవునా నిర్మిస్తారు. దాదాపు కిలో మీటర్ పొడవునా, 150 అడుగుల ఎత్తుతో నిర్మిస్తారు. ఈ స్పిల్‌వేకు 16 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో 48 గేట్లు ఏర్పాటు చేస్తారు. స్పిల్‌వేకు 17 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సి వుంది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి స్పిల్ వే పూర్తి చేయాలనేది లక్ష్యం. వాస్తవానికి డ్యామ్‌కు ఎగువ, దిగువ రెండు కాపర్ డ్యామ్‌లను 2018 మే నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. ఈ నేపధ్యంలోనే భూసేకరణ, పునరావాసం కూడా వ్యూహాత్మకంగానే ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికొచ్చి భూమికి భూమి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో మొత్తం భూసేకరణకు సంబంధించి 15,653 ఎకరాలకు సంబంధించి ఇందులో కేవలం పది శాతం భూమిని మాత్రమే ఇపుడు వినియోగించుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో అయితే మొత్తం 47646 ఎకరాలకు సంబంధించి కూడా అంతే వినియోగం వుంది. పునరావాసం, పరిహారం కూడా ఇపుడు అవసరం మేరకే పరిమితంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. విశాఖ జిల్లా పరిధిలో 4080 ఎకరాలు, ఖమ్మం జిల్లా పరిధిలో 3476 ఎకరాలు సేకరించారు. నాలుగు జిల్లాల పరిధిలో 160541 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 87321 ఎకరాలు సేకరించారు. ఇప్పటి వరకు రూ.2077.06 కోట్ల నిధులు భూసేకరణకు ఖర్చు చేశారు. ఇందులో ప్రధానంగా భూమికి భూమి మాత్రం ఖచ్చితంగా ముంపు ఏరియాకు సమీపంలోని ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోనే నిర్వాసితులకు కేటాయించాల్సి వుంది. ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే జరుగున్నట్టు తెలుస్తోంది.