ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ లబ్ధి కోసమే ముద్రగడ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/రాజమహేంద్రవరం, జూలై 22: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రపై కాపు ప్రజాప్రతినిధులు విమర్శలు కురిపించారు. విశాఖలో, రాజమహేంద్రవరంలో శనివారం విలేఖరుల సమావేశంపెట్టి మరీ ముద్రగడపై తీవ్రంగా ధ్వజమెత్తారు. పద్మనాభం యాత్ర కాపులకు మేలు చేసేందుకు కాదని, తన వ్యక్తిగత రాజకీయ లబ్ధికోసమేనని విశాఖలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అభిప్రా యపడ్డారు. ఇన్నాళ్లూ కాపుల గురించి పట్టించుకోని ముద్రగడ, టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాతే కాపులకు రిజర్వేషన్ల అంశంపై ఉద్యమించడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు టిడిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిలో భాగంగానే మంజునాథ కమిషన్ నియమించిందన్నారు. కమిషన్ నివేదిక వచ్చిన అనంతరం కాపులను బిసిల్లో చేర్చే అంశంపై ముందుకు వెళ్తామన్నారు. కాపులను బిసిల్లో చేర్చేందుకు న్యాయస్థానం అనుమతి, పార్లమెంట్ ఆమోదం అవసరమని ముద్రగడకు తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. కాపులను పూర్తిగా విస్మరించిన వైకాపా, కాంగ్రెస్‌లను ముద్రగడ నిలదీయరెందుకని ప్రశ్నించారు. ఇటీవల వైకాపా ప్లీనరీలో తొమ్మిది హామీలను ప్రకటించిందని, కాపుల అంశం కనీసం ప్రస్తావించలేదన్నారు. ముద్రగడ చేష్టలు కాపు జాతి భవిష్యత్‌ను దెబ్బతీసేలా ఉందని, కాపులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముద్రగడ పాదయాత్ర చేసినంతమాత్రాన కాపులకు రిజర్వేషన్లు దక్కవని, అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమన్నారు.
అదో డొల్ల ఉద్యమం
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్నది డొల్ల ఉద్యమమని రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు ఆరోపించారు. ముద్రగడకు చిత్తశుద్ధి ఉంటే రాజకీయ రిజర్వేషన్లకు తావులేకుండా సామాజిక రిజర్వేషన్లకు ఒప్పుకోవాలని సవాల్ చేశారు. ప్రభుత్వం అతి త్వరలో కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధంగా ఉందని, కాపులను బీసీల్లో చేర్చడం తధ్యమని యర్రా స్పష్టం చేశారు. మంజునాథ కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే కేబినెట్‌లో పెట్టి అనంతరం అసెంబ్లీలో చర్చించి అనంతరం కేంద్రానికి పంపించేందుకు చకచకా చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, కేంద్రంలో ముఖ్యమంత్రిపై వున్న సానుకూలత నేపధ్యంలో సత్వరం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. ఇంత జరుగుతున్నా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కేవలం రాజకీయ దురుద్ధేశ్యంతోనే ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ రిజర్వేషన్లు పక్కనబెట్టి సామాజిక రిజర్వేషన్లకు ఆయన సిద్ధంగా ఉన్నారా అని సవాల్ చేస్తున్నానన్నారు. పాదయాత్రకు అనుమతి కోరకపోవడం ముద్రగడ పలాయన వాదమేనన్నారు. తాను ఒంటరినంటూ పదే పదే చెప్పే ముద్రగడ మాటలు వింటుంటే ఎవరి చేతిలోనో బందీగా ఉన్నారనే భావన కలుగుతోందన్నారు.