ఆంధ్రప్రదేశ్‌

జగన్, చంద్రబాబు ద్రోహులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 22: అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు రాష్టప్రతి ఎన్నికల్లో మిలాఖత్ అయిన విషయాన్ని గుర్తిస్తే ఆ రెండు పార్టీలు కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి మోకరిల్లుతూ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్ట పెట్టినట్టుగా భావించాల్సి ఉంటుందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏఐసిసి పిఆర్‌ఓ కెహెచ్ మునియప్ప ధ్వజమెత్తారు. ఆ పార్టీల అవకాశవాద రాజకీయాలతో చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలపై నగరంలోని ఎపిసిసి కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో కాంగ్రెస్‌కు 8లక్షల మందిని సభ్యులుగా చేర్చడం అభినందనీయమన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ పదవుల కేటాయింపులో తగిన ప్రాధాన్యతనిస్తామన్నారు. సంస్థాగత ఎన్నికల సందర్భంగా 13 జిల్లాలకు జిల్లా ఎన్నికల అధికారులుగా తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 13మంది నేతలను నియమిస్తున్నామని, ఎన్నిక ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విపక్షమనేది లేదన్న విషయం రాష్టప్రతి ఎన్నికల్లో స్పష్టమైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి వారి కోసం సమస్యలపై ఉద్యమిస్తూ బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తుందన్నారు. ఎఐసిసి పిఆర్‌ఓ మునియప్ప మాట్లాడుతూ 8లక్షల మంది సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలన్నారు. గడిచిన మూడేళ్లలో పాలకుల వైఫల్యాలే కాంగ్రెస్‌కు ప్రజాదరణ కలిగిస్తాయన్నారు. గత పదేళ్ల యుపిఎ పాలనలో జరిగిన అభివృద్ధే కాంగ్రెస్‌కు కలిసొస్తుందన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను ఘనంగా జరిపాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎఐసిసి ఎపిఆర్‌ఓ టికె మోహన్, పిసిసి నేతలు టిజెఆర్ సుధాకర్, మాజీ ఎంపి చింతా మోహన్, సభ్యత్వ నమోదు రాష్ట్ర ఇన్‌చార్జ్ పక్కాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.