ఆంధ్రప్రదేశ్‌

బెల్టు షాపులను సమూలంగా నియంత్రిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, జూలై 23 : రాష్ట్రంలో మద్యం బెల్టు షాపులను పూర్తిగా నియంత్రిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహార్ స్పష్టం చేశారు. అలాగే షాపుల్లో ఎమ్మార్పీ ధరకే మద్యం విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి జవహార్ ఆదివారం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని ఆర్‌అండ్‌బి బంగ్లాలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సిఎం చంద్రబాబు మద్యం బెల్టు షాపులపై తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరిచేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించి లైసెన్స్ కలిగిన వైన్ షాపుల నుంచి బెల్టు షాపుల నిర్వాహకులకు మద్యం సరఫరా చేస్తున్న వైన్ షాపుల లైసెన్సు రద్దు చేయడంతో పాటు సంబంధిత ఎక్సైజ్ శాఖ ఎస్‌హెచ్‌ఓ మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు కలిగిన వైన్ షాపులకు మాత్రమే 80 శాతం లెసెన్సులు మంజూరు చేశామన్నారు. మద్యం షాపుల సమస్యలపై నేరుగా తనకే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించానని, దీంతో ఇప్పటికే 7 వేల మంది ఫోన్ చేశారని తెలిపారు. అనవసరంగా రాంగ్ కాల్స్ చేయకూడదని, సమస్యలుంటేనే ఫోన్ చేయాలని సూచించారు. ఇక అనంతపురం జిల్లాలో వేరుశెనగ పంటకు రక్షక తడులు అందించేందుకు సిఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. దీంతో ఎండుతున్న వేరుశెనగ పంటకు రెండు, మూడు రోజుల్లో రక్షక తడులు అందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారన్నారు. మంత్రితో పాటు ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, ఎమ్మెల్సీ శమంతకమణి ఉన్నారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్