ఆంధ్రప్రదేశ్‌

ఎస్టీల విదేశీ విద్య నిబంధనలు సరళతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: తెలివైన ఎస్టీ పిల్లలకు విదేశీ విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్‌బాబు తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద వారికి విదేశీ విద్య అందించనున్నామని, ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళతరం చేశామని చెప్పారు. ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు కనీస మార్కులు 60 శాతం ఉండాలన్న నిబంధనను సడలించి వివిధ జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను చేరుకునేలా చర్యలు చేపట్టామని చెప్పారు.