ఆంధ్రప్రదేశ్‌

మావో దళపతి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జూలై 24: మావోయిస్టు దళంలో అత్యంత కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న ఎసిఎం స్థాయి దళ కమాండర్ మాసను అరెస్టుచేసినట్టు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ఎటపాక సమీపంలో సోమవారం ఉదయం మాసను అరెస్టుచేశామన్నారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని కాకినాడలోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను తెలిపారు. ఎటపాక మండలం పిచుకులపాడు గిరిజన గ్రామం సమీపంలోని టి జంక్షన్ వద్ద పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా, భద్రాచలం వైపునుండి వస్తున్న ఆటోను పోలీసులు నిలుపుచేశారు. అందులో ప్రయాణిస్తున్న వారిని తనిఖీ చేస్తుండగా ఓ యువకుడు పరారయ్యేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అప్రమత్తమై అదుపులోకి తీసుకుని, విచారించగా అతను తన పేరు మదివి మాస అలియాస్ పండమాస అలియాస్ సుభాష్ అలియాస్ మహేష్ అలియాస్ పద అలియాస్ సురేష్ అని చెప్పాడు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం, నారాయణపూర్ జిల్లా, మాడ బ్లాక్, చీపురుగూడెం గ్రామానికి చెందిన లేటు మావోయిస్ట్ భీమయ్య కుమారుడు మాసగా పోలీసులు గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఇతను ప్రస్తుతం కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలోని చర్ల మండలం ఎంకన్నగూడెంలో నివాసం ఉంటున్నాడన్నారు. మాస 2016 జనవరి 24వ తేదీన చీపురుగూడెం గ్రామంలో హిడుమల్ ఎస్‌జెడ్‌సిఎం, డికెఎస్‌జెడ్‌సిఎం బెటాలియన్ కమాండర్ ద్వారా మావోయిస్టు పార్టీలో చేరాడన్నారు. 30 మందితో కలిపి పదిహేను రోజులపాటు ఎలమగొండలో శిక్షణ పొంది 303 రైఫిల్, 12 బోర్ రైఫిల్స్‌తో ఫైరింగ్ నేర్చుకున్నాడు. శిక్షణ అనంతరం హిడుమల్ ఆధ్వర్యంలో సప్లయి టీం కమాండర్ ఎసిఎం కమాండర్‌గా పనిచేస్తూ మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఉత్తర్వులపై పార్టీకి అవసరమైన వస్తువులను చేరవేయడానికి సుమారు రూ.58 వేల విలువ చేసే ద్విచక్ర వాహనాన్ని కొనుగోలుచేశాడు. ఆ వాహనాన్ని ఉపయోగించి సుమారు రూ.10 లక్షలు విలువైన మందులు, రేషన్ సరుకులు, మొబైల్స్, 12 వాట్ల బ్యాటరీలు, వైర్లు, బట్టలు, కిట్‌బ్యాగ్‌లు, ఇనుప గొట్టాలు, రంపపు బ్లేడ్లను కొనుగోలు చేసి పార్టీకి సరఫరా చేసినట్టు ఎస్పీ విశాల్ గున్ని తెలియజేశారు. ఇతను ఒడిస్సా రాష్ట్రంలో మావోలకు, సిఆర్‌పిఎఫ్ దళానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలో పాల్గొని సుమారు 37 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతికి కారకుడని చెప్పారు. ఇతనిపై ఒడిస్సా రాష్ట్రం రూ.5 లక్షల రివార్డును ప్రకటించింది.

చిత్రం.. మావోయిస్ట్ దళ కమాండర్ మాస వివరాలు తెలియజేస్తున్న తూ.గో. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని