ఆంధ్రప్రదేశ్‌

స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో టీకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 24: దేశంలో మీజిల్స్ (తట్టు, తడపర), రుబెల్లా వ్యాధుల నివారణే లక్ష్యంగా రాష్ట్రంలోని పిల్లలందరికీ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఎంఆర్ టీకా (మీజిల్స్, రుబెలా) వేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. 9 నెలల వయస్సు నుంచి 15 ఏళ్లు వచ్చిన పిల్లలందరికీ ఈ టీకా వేయనున్నామన్నారు. ఆగస్టు 1 నుంచి ఏడో తేదీ వరకు వారం రోజులపాటు రాష్ట్రంలో ఉన్న స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఈ టీకాలు వేస్తామన్నారు. ఆగస్టు 7వ తేదీ నుంచి మరో నెల రోజులపాటు గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ తిరిగి పిల్లలను గుర్తించి, టీకాలు వేస్తామన్నారు. సచివాలయంలో నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు 2020 నాటికి దేశం నుంచి మీజిల్స్, రుబెల్లా వ్యాధులను తరిమికొట్టాలనే లక్ష్యంతో ఎంఆర్ టీకాలు వేసే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 3కోట్ల మంది పిల్లలకు ఎంఆర్ టీకాలు వేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కోటీ 23 లక్షల 10వేల 987 పిల్లలకు టీకాలు వేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో 61వేల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, 55వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. వాటిలో విద్యనభ్యసిస్తున్న పిల్లలందరికీ ఎంఆర్ టీకాలు ఉచితంగా వేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ టీకాల వల్ల ఎటువంటి నష్టం లేదని, అవి పూర్తి సురక్షితమని మంత్రి కామినేని స్పష్టం చేశారు. పిల్లల తల్లిదండ్రులకు కూడా ఎంఆర్ టీకాలపై చైతన్యం కల్పించనున్నామన్నారు. జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు అది తగ్గాక టీకా వేస్తామన్నారు. వైద్యులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ అందచేశామన్నారు. వైద్య, ఆరోగ్య ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ టీకాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 70వేల శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీకాలకు వాడే సిరంజిలు ఆటో డిజిబుల్ సిరంజిలని, వాటిని ఒకసారి మాత్రమే వినియోగిస్తారని తెలిపారు. ఇటువంటి సిరంజిలు కోటీ 37వేలు అందుబాటులో ఉంచామన్నారు. 13.70 లక్షల ఎంర్ టీకా వాయిల్స్‌ను 1,450 శీతల చెయిన్ పాయింట్లలో భద్రపరుస్తున్నామన్నారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించిన పిల్లలకు టీకాలు వేయిస్తామన్నారు. ఆగస్టు 7 తరువాత మరో నెల రోజుల పాటు గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికి తిరిగి టీకాలు వేస్తారన్నారు. స్ర్తి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సునీత, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సుజాత శర్మ ప్రసంగించారు. అంతకుముందు నాలుగో బ్లాక్‌లో ఎంఆర్ టీకాల కార్యక్రమం విజయవంతంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత, వైద్య ఆరోగ్య ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, స్ర్తి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సునీత, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సుజాత శర్మ, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయలక్ష్మి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అరుణకుమారితో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన 7గురు ఇండియా ప్రతినిధులు, యునెస్కో రాష్ట్ర కన్వీనర్ మీనా, తదితరులు పాల్గొన్నారు.
వైద్యశాఖలో ఖాళీల భర్తీకి చర్యలు
రాష్ట్రంలో వైద్యశాఖలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో నమోదవుతున్న మలేరియా, డెంగ్యూ జ్వరాలపై సోమవారం ఎపి సచివాలయంలో ఉన్నతాధికారులతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏజెన్సీలో నమోదవుతున్న జ్వరాల నివారణకు మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ సమావేశంలో పలు సూచనలు చేశారు. ఐటిడిఎ పివోలతో సంప్రదించి ఏజెన్సీ ప్రాంతాల్లో వారంతపు సంతలు జరిగే ప్రాంతాల్లో చంద్రన్న సంచార వైద్య సేవలతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఎంప్యానల్‌మెంట్ ఆసుపత్రులకు సంబంధించిన వైద్యాధికారులకు మంత్రి సూచించారు. త్వరలో ఏజన్సీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో స్పెషలిస్టు డాక్టర్స్, నర్సులను నియమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న 142 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు లేటరల్ ఎంట్రీ ద్వారా జూలై 26,27 తేదీలలో కౌన్సిలింగ్ నిర్వహించి, ఆ పోస్టులను భర్తీ చేయాలని మంత్రి కామినేని ఆదేశించారు.