ఆంధ్రప్రదేశ్‌

దంపతులపై కూలిన చెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 24 : ఒక ద్విచక్ర వాహనంపై వెళుతున్న దంపతులపై రోడ్డు పక్కన వున్న చెట్టు వేళ్లతో సహా ఒక్కసారిగా పడిపోవడంతో భార్య మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మానుకొండ డేవిడ్‌రాజు ఆయన భార్య భాగ్యం (42) ద్విచక్ర వాహనంపై సోమవారం వీరిశెట్టిగూడెం నుంచి ఉప్పలపాడు గ్రామానికి వెళుతున్నారు. కామవరపుకోట దాటిన అనంతరం రోడ్డు పక్కనవున్న ఒక చెట్టు ఆకస్మికంగా వేళ్లతో సహా పడిపోవడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి భాగ్యం మృతిచెందినట్లు ధ్రువీకరించారు.