ఆంధ్రప్రదేశ్‌

పోలవరం నిధులకు వైకాపా మోకాలడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి నిధుల రాకుండా కాంగ్రెస్, వైఎస్సార్సీపీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని టీడీపీ ఎంపీలు ఆరోపించారు. సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, కోనకళ్ల నారాయణ, అవంతి శ్రీనివాస్, కిష్టప్ప తదితరులు విలేఖరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండి పడ్డారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండు పార్టీలు పోలవరం విషయంలో రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడంతోపాటు, కోర్టులలో కేసులు వేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, దిగ్విజయ్‌సింగ్, జైరామ్ రమేశ్, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలలో తెలుగురాష్ట్రాలలోని నియోజక వర్గాల పెంపు సవరణ బిల్లు వచ్చే అవకాశం లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలలో నియోజక వర్గాల పెంపు బిల్లు విషయంలో కేంద్రం, బిజెపి నాయకులతో చర్చిస్తున్నామన్నారు.