ఆంధ్రప్రదేశ్‌

నల్లమలలో మావోయిస్టుల డంప్ స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 24: ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని అర్ధవీడు మండలం గనె్నపల్లి సమీపంలో మావోయిస్టులు దాచిన డంప్‌ను కూంబింగ్ పార్టీ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం గనె్నపల్లి సమీపంలోని తూర్పుదిశగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇటీవల కూంబింగ్ పార్టీ సిబ్బంది రెండు రోజులపాటు కూంబింగ్ నిర్వహిచారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని అడుగడుగునా జల్లెడ పట్టారు. ఈక్రమంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కూంబింగ్ పార్టీ పోలీసులు నాళా వెంబడి నడుస్తుండగా ఒక పాలక్యాన్‌ను గుర్తించారు. అనుమానం వచ్చిన కూంబింగ్ పార్టీ పోలీసు సిబ్బంది ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మార్కాపురం ఒఎస్‌డి కె లావణ్యలక్ష్మికి సమాచారాన్ని పోలీసులు అందించగా ఆమె ఇచ్చిన ప్రత్యేక జాగ్రత్తలతో కూంబింగ్ పార్టీ ఆర్‌ఎస్‌ఐ వైఎస్‌ఆర్‌కె ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. అందులో రాకెట్ లాంచర్లకు సంబంధించి విడిభాగాలు బయటపడ్డాయి. రాకెట్ లాంచర్ పైపులు పది, రాకెట్ లాంచర్ క్యాప్స్ 29, రాకెట్ లాంచర్స్ స్పింగ్స్ 20, రాకెట్ లాంచర్ అల్యూమినియం ప్లేట్లు 20, ఇన్నర్‌ట్యూబ్స్ 10, డిటోనేటర్ బేస్‌లు రెండు లభించాయ.