ఆంధ్రప్రదేశ్‌

28న తిరుమలలో గరుడ పంచమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 24: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఈనెల 28న గరుడ పంచమి పర్వదినాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తన ఇష్టవాహనమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.
ఆగస్టు 3 నుంచి పవిత్రోత్సవాలు
శ్రీవారి ఆలయంలో తెలిసి తెలియక జరిగే పొరపాట్లకు ప్రాయశ్ఛిత్తంగా నిర్వహించే పవిత్రోత్సవాలను తిరుమలలో ఆగస్టు 3 నుంచి 5వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 2న వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తారు. అలాగే 3 నుంచి 5వ తేదీ వరకు తిరుప్పావడ సేవ, నిజపాదదర్శనం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది. అంతేకాకుండా ఆయా రోజుల్లో శ్రీవారికి జరిగే తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
26 నుంచి శ్రీనివాస కల్యాణాలు
టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు 5 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రాజెక్టు ప్రత్యేకాధికారి కె.ప్రభాకర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26న చిత్తూరు జిల్లా జిడి నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తారు.