ఆంధ్రప్రదేశ్‌

మద్యం, గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 24: తిరుమలకు నిషేధిత వస్తువులైన మద్యం, గంజాయి, ఎండు చేపలను తీసుకెళుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాటిని స్వాధీనం చేసుకున్నట్లు టిటిడి సివిఎస్‌ఓ రవికృష్ణ తెలిపారు. అలిపిరి చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున అలిపిరి చెక్‌పాయింట్ వద్ద సిఆర్‌పిఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడు, కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తుల వద్ద 7 మద్యం సీసాలు, 100 గ్రాముల గంజాయి, గుట్కా ప్యాకెట్లు, ఎండుచేపలు లభించాయన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని వాటిని తీసుకువచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గంజాయిని తీసుకువచ్చిన వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
అద్దంకిలో గంజాయి స్వాధీనం
ఒంగోలు, జూలై 24: ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణం రామనగర్‌లో గుంజి యల్లమందరావు ఇంటిపై పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అద్దంకి సిఐకి అందిన సమాచారం మేరకు దర్శి డిఎస్‌పి విఎస్ రాంబాబు నేతృత్వంలో పోలీసు సిబ్బంది దాడిచేసి సుమారు 41 లక్షల రూపాయల విలువ చేసే 138 కేజీల గంజాయితోపాటు నిందితుడు ఉపయోగిస్తున్న ఇండికా కారును స్వాదీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్‌పి బి సత్య ఏసుబాబు తెలిపారు. సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో జిల్లా ఎస్‌పి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 23వ తేదీ రాత్రి నిందితుడు యలమందరావుని అరెస్ట్‌చేసి అతని వద్ద ఉన్న 73 వేల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి ఇంటిలో తొమ్మిది ప్లాస్టిక్ గోతాలు, ఒక కర్రల సంచిలో గంజాయి ఆకు, మొగ్గ, గంజాయి ప్యాకెట్లను కనుగొన్నట్లు వివరించారు.