ఆంధ్రప్రదేశ్‌

రేషన్ షాపుల్లో ఇక పామోలిన్, పంచదార, కందిపప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 24: రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో త్వరలో పామోలిన్, పంచదార, కందిపప్పులను ఒక ప్యాకేజీగా ఏర్పాటుచేసి వినియోగదారులకు అందించేందుకు చూస్తున్నామని పౌర సరఫరాలు, ధరల నియంత్రణ, వినియోగదారుల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. విజయవాడ ఆటోనగర్ సమీపంలో పాత చెక్‌పోస్టు వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ 23వేల అడుగుల విస్తీర్ణంలో కొత్త కార్యాలయ భవనాన్ని శ్రావణ మాసం తొలిరోజు మంచి ముహూర్తాన ప్రారంభిస్తున్నామన్నారు. వ కేంద్రం రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే చక్కెర, కిరోసిన్‌లపై కోత విధించడంతో దానిపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. సివిల్ సప్లయిస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఆహార భద్రత కల్పించడంతోపాటు రాష్ట్రంలో వినియోగదారులకు రేషన్ షాపుల్లో సబ్సిడీతో పాటు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ లింగారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి విజయవాడకు సివిల్ సప్లయిస్ కార్యాలయ భవనాన్ని తరలించడం సంతోషదాయకం అన్నారు. మండల లెవెల్ పాయింట్లలో వేబ్రిడ్జిల ఏర్పాటుతో మోసాలకు అడ్డుకట్ట వేశామన్నారు.