ఆంధ్రప్రదేశ్‌

కొండల్లో ఏనుగుల తిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, జూలై 27: ఒడిశాలోని మహేంద్రగిరుల కొండల నుంచి దారి తప్పి మైదాన ప్రాంతమైన ఆంధ్రాలోకి ప్రవేశించిన గజరాజులు నెల రోజులవుతున్నా అటవీశాఖాధికారులు స్పందించడం లేదు. ఇప్పుడా గజరాజులు పంట పొలాలు, ప్రజల ఆస్తిని నష్టపరుస్తున్నాయి. ఏనుగుల సంచారంతో కంటిమీద కునుకు కరవైన ప్రజలను కాపాడాల్సిన అటవీశాఖాధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పలాస మండలం చినంచల పంచాయతీకి చెందిన గోదావరి, ఈదురాపల్లి, సవర గోవిందపురం, బంటుకొత్తూరు ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తూ పంటలను ధ్వంసం చేయడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అటవీశాఖాధికారులు నిపుణులైన మావటీలను తీసుకువచ్చి తరలించాల్సి ఉన్నప్పటికి ప్రయత్నాలు చేయకపోవడంతో ప్రజలకు నష్టాలు తప్పడం లేదు. గురువారం సవరగోవిందపురం సమీపంలోని కొండల్లో ఏనుగుల గుంపు ఉండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.