ఆంధ్రప్రదేశ్‌

పాడి పశువులకూ ఆధార్..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 27: మనుషులకు మాదిరే ఇక ఆవులకూ, పాడి పశువులకూ ఆధార్ నెంబర్లు తీసుకోవాల్సిందే.. పశు సంజీవని పేరుతో పశు సంవర్ధక శాఖలో ఒక వినూత్న పథకం మొదలైంది. ఈ పథకం తూర్పుగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆరంభమైంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పాడి పశువుల బేరసారాలు చేసుకోవచ్చు. అంతర్జాలంలోనే సంతలు నిర్వహించుకుని, ఫొటోల ద్వారా కావాల్సిన పశువులను కొనుగోలు చేసుకోవచ్చు. అమ్మకాలు సాగించవచ్చు. పాడి పశువులకు జియో చెవిపోగులు వేయడం ద్వారా ఆధార్ నంబర్లు ఇచ్చి సమగ్ర వివరాలను అంతర్జాలంలో నిక్షిప్తం చేయడం ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించడానికి ఎపి లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఆల్డా) ‘ఇన్‌ఫర్మేషన్ నెట్ వర్కు ఆన్ యానిమల్ ప్రొడక్షన్ అండ్ హెల్త్’ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డిడిబి) రూపొందించిన ఈ యాప్‌లో పాడి పశువుల సమగ్ర వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. ప్రతీ పశువుకూ 12 అంకెల కలిగిన ఆధార్ కార్డు నంబర్ ఇచ్చి జియో చెవిపోగును దాని చెవికి క్లిప్ చేస్తారు. ఈ క్లిప్ వేసే ముందు ఆయా పశువుల సమగ్ర వివరాల నివేదిక సంబంధిత రైతుకు అందజేస్తారు. పశువు ఎన్ని ఈతలు చేసింది, ఎన్ని పాలు ఇస్తుంది, ఎపుడు ఎదకు వస్తుంది, ఆ పశువు ఆరోగ్య స్థితి, వయసు తదితర సమగ్ర వివరాలన్నీ ఆ నివేదికలో పొందుపర్చి రైతుకు కార్డు ఇస్తారు. పనె్నండు అంకెలు కలిగిన యూనిక్ కోడ్ నంబర్ జియో చెవిపోగును పశువుకు అమర్చుతారు. దీనివల్ల పశువు ఏదైనా ప్రమాదానికి గురైనా, తప్పిపోయినా ఆన్‌లైన్‌లో ఆచూకీ ఇట్టే పసిగట్టే వీలుంది. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ప్రయోగాత్మకంగా ఈ పథకానికి ఎంపికైంది. ఆల్డా ఛైర్మన్ యాళ్ళ దొరబాబు, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టిడిపి నేత పిల్లి సత్యనారాయణ ఇటీవలే ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకాన్ని గోపాలమిత్రల ద్వారా మొదటి విడతగా ఐదు వందల చెవిపోగులు వేశారు. మొత్తం ఐదేళ్ల కాలంలో ఈ పథకాన్ని పూర్తిచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు మన రాష్ట్రాన్ని ఎంపికచేసి అమలు చేపట్టింది. రాష్ట్రంలో లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ తరపున అమలు చేపట్టారు. ప్రతీ పశువుకూ 12 నంబర్లతో డిజిటల్ విశిష్ట సంఖ్యతో ఆధార్ కార్డు ఇచ్చి ప్లాస్టిక్ జియో చెవిపోగు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 10 లక్షల పశువులు, జిల్లాలో దాదాపు 3 లక్షల పశువులు వున్నట్టు అంచనా వేశారు. ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనపుడు పశు సంపదకు నష్టం వాటిల్లితే ఆన్‌లైన్ సమాచారం ద్వారా వివరాలతో బీమా పరిహారం చెల్లిస్తారు. రానున్న రోజుల్లో ఈ ఆధార్ కార్డు లేకపోతే ఎటువంటి పరిహారం చెల్లించేందుకు వీలుపడదు. పశువు కొనాలన్నా, అమ్మాలన్నా ఈ నంబర్ ప్రధానంగా వుంటుంది. పశువుల వైద్యులు చెక్ లిస్టు ప్రకారం రూపొందించే హెల్త్ కార్డులో ఆయా పశువులు ఎపుడు ఎదకు వస్తాయనే వివరాలు కూడా అందులో పొందుపర్చుతారు. పాడిపశువుల ఒఎల్‌ఎక్స్ ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు పూర్తిస్థాయిలో ఈ సమాచారాన్ని యాప్‌లో పొందేలా టెక్నాలజీని రూపొందించారు.

చిత్రాలు.. . తూ.గో.లో ఆవులకు ఆధార్ జియో చెవిపోగు వేస్తున్న ఆల్డా ఛైర్మన్ యాళ్ళ దొరబాబు (ఫైల్ ఫొటో)
* ఆధార్ నెంబరు చెవిపోగులు