ఆంధ్రప్రదేశ్‌

అద్దంకిలో యుద్ధ్ద వాతావరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, జూలై 27 : ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో కరణం, గొట్టిపాటి వర్గాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొనడంతో ఎప్పుడు ఏమవుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వైకాపా నుంచి టిడిపిలోకి ఎమ్మెల్యే గొట్టిపాటి ఆగమనం నుంచి పోరు తీవ్రమైంది. ఒకే పార్టీలో ఉండడంతో ఆధిపత్య పోరు జరుగుతోంది. అద్దంకి పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల వద్ద ఏర్పాటు చేసిన సిసి రోడ్డు, పోతురాజుగండి వద్ద ఏర్పాటు చేసిన సిసి రోడ్డు, దామావారిపాలెం నుంచి సంతమాగులూరు వరకు ఏర్పాటు చేసిన తారురోడ్డు నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న తరుణంలో స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం ఆయా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయాలన్న తలంపుతో అధికారులతో చెప్పి ముందుగా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వం అధికారంలో లేని సమయంలో పదేళ్లపాటు టిడిపిని కాపాడి, ఎమ్మెల్సీగా పదవి పొందిన కరణం బలరామకృష్ణమూర్తి ప్రభుత్వం నుంచి తాను తెప్పించిన నిధులతో పనులు జరగ్గా, ఆయా అభివృద్ధి పనులకు తానే ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందుగా గురువారం ఉదయం వేకువఝామున 3 గంటల ప్రాంతంలో ప్రభుత్వ వైద్యశాల, పోతురాజుగండి, దామావారిపాలెం కూడలితో కలిపి మూడు ప్రాంతాల్లో తన అనుచరులు ఏర్పాటు చేసిన శిలాఫలకాలతో ప్రారంభోత్సవం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభోత్సవం చేయాల్సిన అభివృద్ధి పనులకు బలరాం ప్రారంభోత్సవాలు చేయడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముందని గమనించిన పోలీసులు, అధికారులు బలరాం ప్రారంభోత్సవాలు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అద్దంకి మున్సిపాలిటీ అనుమతి లేకుండా ప్రారంభోత్సవాలు చేయకూడదంటూ నగరపాలకసంస్థ కమిషనర్ నారాయణ, డిఎస్‌పి రాంబాబు పర్యవేక్షణలో శిలాఫలకాలను ధ్వంసం చేశారు. బలరాం ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకాలు ధ్వంసం చేశారని ప్రచారం కావడంతో అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కరణం వర్గీయులు, గొట్టిపాటి వర్గీయులు వందలాదిగా తరలివచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సిఐ హైమారావు ఆధ్వర్యంలో 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.