ఆంధ్రప్రదేశ్‌

కాపు రిజర్వేషన్లపై ప్లీనరీలో ఎందుకు చర్చించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: కాపుల రిజర్వేషన్ల విషయంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కాపుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉండి ఉంటే రిజర్వేషన్ల అంశంపై ఇటీవల జరిగిన వైఎస్సార్‌సిపి ప్లీనరీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ఇతర కులాలను బిసిల్లో చేర్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కాపుల రిజర్వేషన్ల కమిషన్‌కు నిధులు కూడా కేటాయించలేదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో కాపుల రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తుంటే ముద్రగడ పద్మనాభం రాద్ధాంతం చేయడం తగదని హితవు పలికారు. ముద్రగడ గురువారం కూడా బయటకు రావాలని ప్రయత్నం చేశారని, ఏడు రోజుల పాటు బయటకు రావద్దని చెప్పామన్నారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్ అవసరం లేదని, విద్యా, ఉపాధి రంగంలో రిజర్వేషన్ కావాలని కోరుతూ సిఎంను కాపు సంఘాల నేతలు త్వరలో కలుస్తారని తెలిపారు. కాపులను బిసిల్లో చేర్చే సత్తా చంద్రబాబుకే ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే శక్తుల ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు. తుని సంఘటనకు సంబంధించి కేసును సిబిసిఐడి పర్యవేక్షిస్తోందని, ఆ సంఘటనతో ప్రమేయం ఉన్న వారిని సిఐడి అరెస్ట్ చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేనందునే ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధంలో ఉంచారని వివరించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ముద్రగడ, జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. త్వరలోనే కాపు ప్రజా ప్రతినిధులంతా ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తారన్నారు. సాధ్యమైనంత త్వరగా మంజునాథ్ కమిషన్ నివేదిక వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రిని మరోసారి కోరతామని తెలిపారు. మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యాలపై స్పందిస్తూ, ఆయన తమ క్యాబినెట్‌లో మంత్రి అయినప్పటికీ, తమ పార్టీ నేత కాదని గుర్తు చేశారు. మిత్రపక్షం అయినప్పటికీ బిజెపి తమపై వ్యాఖ్యలు చేస్తున్నదని, ఈ అంశం సిఎం చూసుకుంటారని తెలిపారు.