ఆంధ్రప్రదేశ్‌

మెరుగైన శిక్షణతో యువతకు ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి రంగంలో మెరుగైన శిక్షణా కార్యక్రమాలను యువతకు అందించడం ద్వారా గణనీయమైన ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటోందని ఏపి టాస్క్ఫోర్స్ కమిటీ కన్వీనర్ (్ఫర్మా అండ్ బయోటెక్) శ్రీనివాస్ శంకర్ ప్రసాద్ తెలిపారు. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని స్కిల్ డెవలప్‌మెంట్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అత్యుత్తమ సాంకేతిక నైపుణ్య రంగంలో శిక్షణ ఇస్తున్న సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలను అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ నెలలో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. సిసిబిఎం, సిఎస్‌ఎంసిఐఆర్-్భవనగర్, ఎన్‌సిఎల్-పుణే, ఐఐసిబి-కల్‌కత్తా, నిరి-నాగపూర్, ఎల్‌ఎస్‌ఎస్‌ఎస్‌డిసి ప్రతినిధులతో పాటు పరిశ్రమలు, ఎకడమిక్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించినప్పుడే పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని ప్రసాద్ తెలిపారు. ఆ దిశలో రాబోయే ఐదేళ్ల కాలంలో నైపుణ్యాభివృద్ధి గల 80 వేల మంది, పాక్షిక నైపుణ్యం గల 3 నుంచి 4 లక్షల మందికి శిక్షణను అందించాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నామన్నారు. ఇందుకోసం ఉన్నతస్థాయి విద్యతో పాటు స్వయం ఉపాధి దిశలో కూడా అభ్యర్థులను గుర్తించి ఉత్తమ శిక్షణను అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అచ్యుతాపురంలో ఫార్మా, బయోటెక్నాలజీ క్లస్టర్లు, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో బయోసిటీ, నెల్లూరు జిల్లా తమ్మినపట్నంలో నెహ్రూ ఫార్మాసిటీ, కడపలో ఏపిసిఎఆర్‌ఎల్, హిందూపురంలో జిఎస్‌కె లేపాక్షి బయోటెక్నాలజీ పార్కు, నాయుడుపేట, నక్కపల్లిలో వివిధ క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నోటిఫికేషన్ ద్వారా బిటెక్, ఎంటెక్, ఎంఎస్‌సి, కెమికల్ ఇంజనీరింగ్, ఫార్మా, కెమిస్ట్రీ రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన వారికి 6 నెలల శిక్షణా కార్యక్రమాన్ని అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని శంకర్ ప్రసాద్ తెలిపారు.