ఆంధ్రప్రదేశ్‌

వణికిస్తున్న గజరాజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, జూలై 28: మైదాన ప్రాంతాల్లో గజరాజులు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని మైదాన ప్రాంతాల్లో సంచరిస్తూ పంట పొలాలను నాశనం చేయడంతోపాటు బీభత్సం సృష్టిస్తున్న గజరాజులపై ఇప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో గజరాజుల సంచారం సర్వసాధారణం కావడంతో అటవీశాఖాధికారులు కూడా వాటిపై దృష్టి సారించడం లేదని బాధితులు వాపోతున్నారు. ఒడిశా నుంచి వచ్చిన మొదట్లోనే గజరాజులను అడవిలోకి తరలించి ఉంటే జిల్లాలో పంట నష్టం తప్పేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏనుగుల దాడిలో పలువురు గాయపడడం, చేతికందిన పంటలు నాశనమవుతున్నా అధికారులు స్పందించడం లేదు. ఏనుగులు గుంపులు, గుంపులుగా సంచరిస్తుండడంతో వాటిని చూసేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు. పగటిపూట సమీపంలోని కొండల్లో, తోటల్లో ఉండి రాత్రి వేళల్లో గ్రామాల్లోకి వస్తుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉంటున్నారు.