ఆంధ్రప్రదేశ్‌

మావోల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, అరకులోయ, జూలై 28: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం మావోయిస్టులు ఎఒబి సరిహద్దులో భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరు, అరకులోయ, చింతపల్లి, సీలేరు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలను ఆనుకుని ఉన్న ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మారుమూల గ్రామాలకు చెందిన వందలాది మంది ఆదివాసీలు మావోయిస్టులు నిర్వహించిన వారోత్సవాలు, బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి వెళ్లడం విశేషం. అమరులైన మావోయిస్టులకు నివాళి అర్పించేందుకు మావోయిస్టులు ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. తొలిరోజైన శుక్రవారం వారోత్సవాలను ఘనంగా ప్రారంభించుకున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు మండలం మారుమూల ప్రాంతంలో మావోయిస్టులు వారోత్సవాలను ప్రారంభించి బహిరంగ సభ నిర్వహించినట్టు తెలిసింది. బహిరంగ సభకు ముందుగా తరలివచ్చిన గిరిజనంతో మావోయిస్టులు భారీ ర్యాలీ నిర్వహించినట్టు తెలుస్తోంది. వారోత్సవాల సందర్భంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం మావోయిస్టులు, గిరిజనుల నినాదాలతో దద్దరిల్లింది. ర్యాలీ, బహిరంగ సభలలో మావోయిస్టులు యూనిఫారం ధరించకుండా సాధారణ దుస్తుల్లోనే హాజరైనట్లు తెలుస్తోంది.రామగుడ ఎన్‌కౌంటర్‌లో అశువులు బాసిన మావోయిస్టు నాయకులకు నివాళి అర్పించేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భద్రతా చర్యలు చేపట్టారు.