ఆంధ్రప్రదేశ్‌

నష్టాల్లో ఉన్న ఆర్‌టిసిని ప్రభుత్వమే ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఏపిఎస్‌ఆర్‌టిసి ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు అధ్యక్షతన శుక్రవారం జరిగిన అఖిలపక్షం సదస్సులో పాల్గొన్న వివిధ కార్మిక సంఘాల, రాజకీయ పక్షాల నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నాటికి ఏపిఎస్‌ఆర్‌టిసి వాటాకు రూ.2700 కోట్ల అప్పులు, నష్టాలు ఉండేవన్నారు. విభజన తరువాత మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతంనాలుగువేల కోట్ల రూపాయలు అప్పులు, నష్టాలతో ఉందన్నారు. ఆర్టీసీ నష్టాలకు సంస్థలో పనిచేస్తున్న కార్మికులు కారణం కాదని, ప్రైవేటు వాహనాల అక్రమ రవాణాను అరికట్టలేని ప్రభుత్వం అసమర్థత వలన ఏడాదికి సుమారు 1500 కోట్ల రూపాయల మేర ఆర్టీసీ నష్టపోతోందన్నారు. దానికితోడు లోపభూయిష్ట విధానాలు, అధిక పన్నులు, కార్మికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా యాజమాన్యం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల వలనే నష్టాలు వస్తున్నాయని అన్నారు. ఈ నష్టాలు సాకుగా చూపిస్తూ రోజు రోజుకు బస్సుల సంఖ్యను కుదిస్తున్నారన్నారు. 2016 జూన్ నుండి 2017 జూన్ కాలంలో సుమారు 700 బస్సులు తగ్గించారన్నారు. సిబ్బందిని కూడా 2,600 మందిని తగ్గించారన్నారు. ఇదే పరిస్థతి కొనసాగిస్తే ప్రస్తుతం ఉన్న 56,200 మందిలో మరో 19 సంవత్సరాలకు సగం సిబ్బంది, సగం బస్సులు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్, ఆర్టీసీ స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ సుందరయ్య, వివిధ కార్మిక సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ లాభనష్టాలతో సంబంధం లేకుండా విద్యా, వైద్య రంగాలను ఆదుకుంటున్న విధంగానే, ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కూడా ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇందుకోసం ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఎటువంటి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టినా సరే తమ పూర్తి మద్దతు ఉంటుందని అఖిలపక్షం సదస్సుకు హాజరైన నాయకులు మద్దతు తెలిపారు.