ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికలు ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించక పోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదవీకాలం ముగిసిన కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా గతంలోనే హైకోర్టు ఆదేశించినా నిర్వహించకపోవడానికి కారణం ఏమిటో తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలున్నా కాకినాడ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించకపోవడం పట్ల చిటినీడి నారాయణమూర్తి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ పి నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానికి 2010లోనే పదవీకాలం ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్ చేస్తూ 2015లో పిటిషన్‌దారు హైకోర్టును ఆశ్రయించారు. డీ లిమిటేషన్ ప్రక్రియ కారణంగా ఎన్నికలు నిర్వహించలేదని, ఈ ప్రక్రియ ముగిసాక 45 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. అయినప్పటికీ ఎన్నికలు నిర్వహించక పోవడం కోర్టు ధిక్కారమని పిటిషన్‌దారు హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కోర్టు ఆదేశాలను విస్మరించడం పట్ల హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఎన్నికలు నిర్వహించక పోవడానికి కారణాలను ఆగస్టు 4వ తేదీ లోగా కోర్టుకు తెలియజేయాల్సిందిగా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.