ఆంధ్రప్రదేశ్‌

పోలవరాన్ని అడ్డుకుంటున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు, నూతన రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఢిల్లీ నుంచి కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డిలపై ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్రజలవనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన ‘జలమంతర్-4’ కార్యక్రమంలో మంత్రి దేవినేని పాల్గొన్నారు. అనంతరం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులు,ప్రజల భాగస్వామ్యంతో ఆగస్టు నుంచి నెల రోజులపాటు జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. విజయవాడలో నకిలీ మద్యం సరఫరా కేసులో విచారణ ఎదుర్కొంటున్న మల్లాది విష్ణును వైకాపాలోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వంపై వైకాపా నేతలు బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ‘రాష్టమ్రంతటా 144 సెక్షన్ విధించారంటూ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టొద్దు, ఉద్యోగాలు ఇవ్వొద్దని తప్పుడు సంకేతాలిచ్చే ప్రయత్నమే ఇది’’ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవాలని కాంగ్రెస్, వైకాపాలు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.