ఆంధ్రప్రదేశ్‌

జిఎస్టీతో చిన్నపాటి సమస్యలు సహజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూలై 28: జిఎస్టీవల్ల ప్రారంభంలో చిన్నపాటి సమస్యలు సహజమేనని, ఆగస్టు ఒకటిన మరోమారు జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని అందులో పలు సమస్యలపై చర్చిస్తారని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలిలో నూతనంగా ఏర్పాటుచేసిన రెండు వాణిజ్య పన్నులశాఖ కార్యాలయాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో యనమల మాట్లాడుతూ జిఎస్టీ వంటి నూతన విధానాలవల్ల మొదట్లో చిన్నపాటి సమస్యలు సహజమేనని చెప్పారు. గత మూడేళ్లుగా ప్రజలపై పన్నుల భారం లేకుండా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అభివృద్ధి జరగాలంటే ఆదాయం పెరగాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రెవెన్యూ లోటును భర్తీచేస్తున్నామని చెప్పారు. ఇష్టానుసారంగా పన్నుల భారం మోపితే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్నారు. జిఎస్టీ అమలు విధానం రాష్ట్రాల చేతుల్లో ఉండదని, జిఎస్టీ కౌన్సిల్‌లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారన్నారు. పన్నుల లావాదేవీలు మొత్తం ఆన్‌లైన్ ద్వారానే జరుగుతాయన్నారు. వ్యాపారులు కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పారు. సమావేశంలో తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి డివిజన్ వాణిజ్యపన్నుల శాఖ సహాయ కమిషనర్ సత్యనారాయణ, ఆర్డీఓ జి నరసింహులు, డిఎస్పీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.