ఆంధ్రప్రదేశ్‌

బిసిలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: బిసిలకు నష్టం లేకుండా తమ ప్రభుత్వం త్వరలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తుందని కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ (కాపు కార్పొరేషన్) చైర్మన్ చలమలశెట్టి రామానుజయ చెప్పారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులకు విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్ కల్పిస్తామని, బిసిలకు అన్యాయం జరుగకుండా తమిళనాడు తరహాలో అదనంగా రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలిపారు. విదేశీ విద్యా సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న 220 మంది విద్యార్థులను గురువారం ఇంటర్వ్యూ చేసినట్లు తెలిపారు. సివిల్ సర్వీస్‌తో పాటు అనేక పోటీ పరీక్షలకు ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన వారికి నెలకు రూ.10వేలు స్ట్ఫైండ్ ఇస్తూ 9 నెలల పాటు శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షం ఒక పక్క రాజధాని నిర్మాణానికి అడ్డు తగులుతూ, మరోపక్క రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాకుండా వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అటువంటివారి కొమ్ము కాయడం ముద్రగడకు తగదని హితవు పలికారు. ప్రతిపక్షం వద్ద తాయిలాలు తీసుకున్న ముద్రగడపై తమ డిమాండ్లు అమలు చేయాలన్న ఒత్తిడి పెరగడంతో పాదయాత్రకు పూనుకున్నట్లుగా ఆయన ఆరోపించారు. అన్ని విషయాలు అర్థం చేసుకుని పాదయాత్ర విషయంలో సంయమనం పాటించిన కాపు యువతకు అభినందనలు తెలిపారు.