ఆంధ్రప్రదేశ్‌

కోటి ఉద్యోగాల హామీ ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూలై 28: ఎన్నికల ముందు ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మంచి గద్దెనెక్కిన ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు కల్పించలేకపోయారని ఢిల్లీ ఎన్‌ఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్‌కుమార్ అన్నారు. విద్యార్థి, యువత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో శుక్రవారం లాంగ్‌మార్చ్ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కాలేజి మైదానంలో జరిగిన బహిరంగ సభలో కన్హయ్‌కుమార్ మాట్లాడుతూ కోటి ఉద్యోగాల పేరుతో ఎన్నికల ముందు యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీ విస్మరించడం దారుణమన్నారు. కేంద్ర ఫ్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం గల ప్రజాస్వామ్య దేశంలో ఎవరి సంప్రదాయ ఆచారాలను వారి పాటిస్తారని పేర్కొన్నారు. ఎవరని ప్రేమించాలో, ఎవరిని పెళ్లిచేసుకోవాలో మిమ్మల్ని అడగాల్సిన దౌర్భాగ్యం ఇంకా రాలేదని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేములను బిజెపి ఆరచాకశక్తులే హత్య చేశాయని ఆరోపించారు. ఢిల్లీ జెఎన్‌యూలో ఉన్న తెలుగు వ్యక్తి ప్రొఫెసర్ జగదీష్‌కుమార్ ఏపికి చేడ్డపేరు తెస్తున్నారన్నారు. తమలోని మలినాన్ని శుద్ది చేసుకోని వారు స్వచ్ఛ భారత్ అంటూ తెల్లదస్తులతో చీపుర్లు పట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పేద ప్రజలకు ఆర్థిక స్వావలంభన లభించే విధంగా అభివృద్ధి చెందిన రోజే దేశం మారుతుందని పేర్కొన్నారు. గోరక్షణ పేరుతో దశితులు, గిరిజనులు, క్రెస్తవులు, ముస్లింలపై దాడులు చేసి అరచకాలు సృష్టిస్తున్న బిజెపి అనుబంధ ఆర్‌ఎస్‌ఎస్ అగడాలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రధాని తన వైఖరి మార్చుకుని కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానానికి స్వస్తి పలికి పేద ప్రజల అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎఐఎస్‌ఎఫ్ జాతీయ నాయకురాలు అపర్‌జిత్ రాజా, జాతీయ అధ్యక్షుడు వలీవుల్లాఖాత్రీ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. అనంతపురం సభలో ప్రసంగిస్తున్న కన్హయ్‌కుమార్