ఆంధ్రప్రదేశ్‌

ఫ్రతిసారీ విలక్షణ తీర్పే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూలై 28: కర్నూలు జిల్లా నంద్యాల ఓటర్లు ఎల్లప్పుడూ విలక్షణ తీర్పు ఇస్తున్నారు. నంద్యాలలో కేవలం రెండు సామాజికవర్గాల మధ్యే పోటీ జరుగుతోంది. మొదటి నుండి రెడ్డి సామాజికవర్గం, ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన వారే నంద్యాల ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అంతేగాక ఏ ఒక్కరినీ వరుసగా రెండుసార్లకు మించి ఎమ్మెల్యేగా గెలిపించడం లేదు. స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారి నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరిగింది. అప్పట్లో ఇండిపెండెంట్ అభ్యిర్థిగా పోటీ చేసిన మల్లు సుబ్బారెడ్డి నంద్యాల మొట్టమొదటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1955లో జి.రామిరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నంద్యాల నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. ఆయన మృతి చెందడంతో 1959లో నంద్యాలకు మొట్టమొదటి సారి ఉపఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో జివి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 1962లో మళ్లీ మల్లు సుబ్బారెడ్డి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ పార్టీ అభ్యిర్థిగా ఎస్‌బి నబీసాహెబ్, 1972లో ఇండిపెండెంట్ అభ్యిర్థిగా బొజ్జా వెంకటరెడ్డి, 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా బొజ్జా వెంకటరెడ్డి నంద్యాల నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో తెలుగుదేశం పార్టీ హవాలో సంజీవరెడ్డి తెలుగుదేశం పార్టీపై గెలుపొందారు. మళ్లీ 1985లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ఎస్‌బి నబీసాహెబ్ మేనల్లుడు ఎన్‌ఎండి ఫరూక్ టిడిపి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొంది మొట్టమొదటి సారి మంత్రివర్గంలో చోటు సాధించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యిర్థిగా వి.రామనాధరెడ్డి గెలిచారు. 1994లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎండి ఫరూక్ గెలిచి డిప్యూటీ స్పీకర్ పదవి పొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎండి ఫరూక్ ఎస్పీవైరెడ్డిపై గెలుపొంది క్యాబినెట్‌లో స్థానం పొందారు. 2004 ఎన్నికల్లో శిల్పా మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి రాష్ట్రంలోనే రెండవ అత్యధిక మెజార్టీ సాధించారు. 2009 ఎన్నికల్లో రెండవసారి శిల్పామోహన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి గృహ నిర్మాణశాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో భూమానాగిరెడ్డి వైకాపా అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం మీద నంద్యాల అసెంబ్లీకి 1952 నుండి జరిగిన ఎన్నికల్లో రెడ్డి, ముస్లీం సామాజిక వర్గం వారే అభ్యర్థులుగా పోటీపడ్డారు. నంద్యాల ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇస్తారన్నది ప్రాచుర్యంలో ఉంది. ఏ అభ్యర్థినీ వరుసగా ఇంతవరకు మూడుసార్లు గెలిపించలేదు. అభివృద్ధిని కాంక్షిస్తున్న నంద్యాల ప్రజలు ఫ్యాక్షన్ మూలాలు ఉన్న అభ్యర్థులను ఏనాడు గెలిపించలేదు. ప్రతి ఎన్నికలో తమ విలక్షణమైన తీర్పుతో గెలుస్తాడనుకున్న అభ్యర్థిని అనూహ్యంగా ఓడించడం, ఓటమి అంచుల్లో నిలిచిన వారికి పట్టం కట్టిన ఘనచరిత్ర నంద్యాల ఓటర్లకు ఉంది. త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో నంద్యాల ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే.