ఆంధ్రప్రదేశ్‌

బయటకొస్తే నేనేమిటో చూపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 28: తాను ఇంటి నుండి బయటకంటూ వస్తే పాదయాత్ర చేసేందుకే వస్తానని, అంతవరకు ఎదురుచూస్తాను తప్ప తన నిర్ణయంలో ఏ విధమైన మార్పు ఉండదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. దమ్ముంటే పోలీసు బలగాలను ప్రభుత్వం వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. గత రెండు రోజులుగా మీడియాను ముద్రగడ నివాసంలోకి అనుమతించని పోలీసులు శుక్రవారం ఎట్టకేలకు అనుమతించారు. దీంతో కొద్దిసేపు విలేఖరులతో ముద్రగడ మాట్లాడారు. ముద్రగడకు పాదయాత్ర చేసే ఉద్దేశ్యం లేదంటూ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఇంట్లో నుండి బయటకు వచ్చాక పాదయాత్ర చేసి చూపిస్తానని, అలా జరిగితే అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి తన పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. గృహ నిర్బంధంలో ఉంచితే గుండెపోటు వచ్చినా ఇంట్లోనే చనిపోతాను తప్ప ఆసుపత్రికి వెళ్ళనని చెప్పారు. పోలీసు అధికారులు కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారన్నారు. ఒక అధికారి తనపై నిర్బంధం విధించినట్టుగాను, మరో అధికారి వ్యక్తిగత అవసరాల రీత్యా బయటకు వెళ్ళవచ్చంటూ సూచిస్తున్నారని వాపోయారు. పొంతన లేని ప్రకటనలతో ప్రజలు కూడా విస్మయానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళకు తాను బయటకు వెళ్ళనని, వెళితే పాదయాత్ర చేసేందుకు బయట అడుగుపెడతానని ముద్రగడ స్పష్టం చేశారు. మూడు సింహాలకు మారుపేరైన ఐపిఎస్‌లు తలోవిధంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఐపిఎస్‌లంటే తనకు గౌరవం ఉందని, వారికి ఇప్పటివరకు ఓ గుర్తింపు ఉందని, ఇటీవలి కాలంలో వారి చర్యలతో తమ గుర్తింపును, గౌరవాన్ని కోల్పోయే దుస్థితి వాటిల్లిందన్నారు. కొందరు ఐపిఎస్‌లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తయారయ్యారని విమర్శించారు. కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేడు కాపులనే అణగదొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చంద్రబాబుకు ఒక రాజ్యాంగం, కాపులకు మరో రాజ్యాంగమా? అని ప్రశ్నించారు. చట్టం చంద్రబాబు చుట్టంగా మారిందని విమర్శించారు. పరిస్థితులు ఎపుడూ ఒకేలా ఉండవని, అమావాస్య తొలగిపోయి పౌర్ణమి రాకమానదని అన్నారు.

చిత్రం.. కిర్లంపూడిలోని తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతున్న ముద్రగడ