ఆంధ్రప్రదేశ్‌

మందకొడిగా ముందస్తు ఖరీఫ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 29: గోదావరి బేసిన్‌లో వరి నాట్లు మందకొడిగా సాగుతున్నాయి..పట్టిసీమ నేపధ్యంలో కృష్ణా బేసిన్‌లో మాత్రం జోరుగా ఖరీఫ్ సాగింది. గోదావరి బేసిన్‌లో ఈ నెలాఖరుకు నాట్లు పూర్తి చేయాలని అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉభయ గోదావరి జిల్లాల డెల్టాల కింద 9.80 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు మొదలెట్టారు. కౌలురైతులకు సకాలంలో రుణాల అందని స్థితిలో నాట్లు ఆలస్యానికి ఒక కారణంగా తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కాస్తంత జోరుగా నాట్లు పడ్డాయి. ముందస్తు ఖరీఫ్ అనేది తూర్పులో సాగలేదని చెబుతున్నారు. ఇందుకు అనేక కారణాలు వున్నాయని తెలుస్తోంది. అత్యధిక భూములు కౌలుదారుల చేతుల్లోనే వున్నాయి. భూముల కౌలు శిస్తులు కూడా పెరిగాయి. దీనికి తోడు వ్యవసాయ ఖర్చులు కూడా గత ఏడాది కంటే అధికమయ్యాయి. ఈ నేపధ్యంలో కౌలు రైతులు సాగుకు భూములను తీసుకున్నప్పటికీ పెట్టుబడుల నిమిత్తం చేతిలో డబ్బులేక నిర్ధేశిత ముందస్తు ఖరీఫ్ కార్యాచరణలో భాగస్వామ్యం కాలేకపోయారు. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం ఐదు లక్షల మంది కౌలురైతులకు రుణాలు కల్పించేందుకు ప్రస్తుతం చర్యలు చేపట్టారు. ఈ నెలాఖరుల నుంచి రుణాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. సహకార రుణాలను ఒకరికొకరు జామీన్ ఇచ్చే పద్ధతిన కౌలురైతులకు సహకార రుణాలను ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. కౌలు రైతులకు రూ. 5 కోట్ల సహకార రుణాలు పంపిణీ చేసేందుకు అధికారులు తాజాగా మొదలెట్టారు. రైతులకు అవసరమైనపుడు కాకుండా అదను దాటిన తర్వాత రుణాలు అందించడం వల్ల ముందస్తు ఖరీఫ్ సాధ్యపడలేదు. ఆగస్టు నెలాఖరుకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించారు. నాట్లు పూర్తి కావాలని ఈ నెలాఖరుకు లక్ష్యం నిర్ధేశించగా పెట్టుబడి రుణాలు మాత్రం ఆగస్టు నెలాఖరుకు అందించాలని నిర్ధేశించారు. లోన్ ఎలిజిబిలిటీ సర్ట్ఫికేట్లు మేరకు రుణాలు ఇస్తున్నారు. ఈ కార్డులు పొందకపోతే కౌలు రైతులకు వ్యవసాయ శాఖ జారీ చేసిన సర్ట్ఫికేట్లుతో రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టారు.
గోదావరి బేసిన్‌లో ఈ నెలాఖరుకల్లా నాట్లు పూర్తి కావాలని నిర్ధేశించారు. కానీ ఇప్పటికొచ్చి 65 శాతం మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. కోనసీమ ప్రాంతంలో వేసవి కాలువల మరమ్మతులు, ఆధునికీకరణ పనులు సకాలంలో పూర్తికాకపోవడం వల్ల కూడా శివారుకు సాగునీరు అందని స్థితిలో ఖరీఫ్ పనులు మొదలు కాలేదు. బోర్ల కింద సాగయ్యే భూముల్లోనే ఖరీఫ్ సకాలంలో పూర్తయింది. దీనికి తోడు గోదావరి బేసిన్‌లో వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో మరింత ఆలస్యమవుతోంది.
మెట్ట ప్రాంతంలో ఇంకా ఎత్తిపోతల పధకాల నుంచి సాగునీరు అందించలేదు. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని పుష్కలంగా కృష్ణాకు తీసుకెళ్లడంతో కృష్ణా బేసిన్‌లో ముందస్తు ఖరీఫ్ సాధ్యమైంది. గోదావరి బేసిన్‌లో మాత్రం ముందస్తు ఖరీఫ్ అనేది ముందుకు సాగడంలేదని తెలుస్తోంది. మెట్టకు సకాలంలో సాగునీరు అందించడంలో ఆలస్యంతో పాటు ఆధునీకరణ పనుల వల్ల ముందుగా డెల్టాల్లో నీటి సరఫరా శివారుకు అందకపోవడంతోనూ, వ్యవసాయ పెట్టుబడులు సకాలంలో అందకపోవడం వల్ల ముందస్తు ఖరీఫ్ మందకొడిగా సాగుతోంది. కౌలు రైతులకు ఇంకా అందని రుణాలు వల్ల సాధారణంగా జరిగే ఖరీఫ్ కంటే ఈ ఏడాది మరో నెల ఆలస్యమయ్యే పరిస్థితి దాపురించింది.