ఆంధ్రప్రదేశ్‌

మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్‌లో డిష్యుం డిష్యుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూలై 29: చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అందరూ నివ్వెరపోయే సంఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం 12గంటలకు చైర్మన్ శివకుమార్ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం ప్రారంభంలోనే అధికారపార్టీ వారు అభివృద్ధి పనులు ముసుగులో అవినీతికి పాల్పడుతున్నారని, ఇందుకు మా పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్‌లు ప్రోత్సహిస్తున్నారని వైసిపి కౌన్సిలర్ ఖాజా పక్కసీట్లో కూర్చోని ఉన్న వైసిపి కౌన్సిలర్ షమీంఅస్లాం వైపు వేలు చూపుతూ ఆరోపించారు. తనవైపు చేయి చూపుతూ అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లు ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటూ వైసిపి కౌన్సిలర్ షమీంఅస్లాం, మరోవర్గానికి చెందిన వైసిపి కౌన్సిల్ ఖాజాను నిలదీశారు. ఇద్దరిమధ్య తిట్లపురాణం చేసుకోవడం, అంతలోనే షమీం అస్లాం ఖాజా చొక్కా పట్టుకుని అవినీతి నిరూపించాలని నిలదీశారు. దీంతో రెండువర్గాల కౌన్సిలర్లు ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. తమపై దాడికి పాల్పడిన కౌన్సిలర్ షమీంఅస్లాంపై చర్యలు తీసుకోవాలని మరోవర్గం జింకాచలపతి, ఖాజా, మస్తాన్‌రెడ్డి పోడియం ముందు బైఠాయించి నిరసనలకు దిగారు. ప్రతిపక్ష సభ్యుల తీరు మరింత మితిమీరిపోతుండటంతో సమావేశంలోని అంశాలన్నీ అధికారపార్టీ సభ్యులు ఆమోదించడంతో సమావేశం ముగిసినట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో అజెండాలోని కీలకమైన 24అంశాలపై ఎలాంటి చర్చ జరపకుండానే సమావేశం ముగించేశారు.