ఆంధ్రప్రదేశ్‌

అమ్మ, బ్రహ్మణీ కష్టపడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ‘మా అమ్మ, భార్య బ్రహ్మణీ బాగా కష్టపడుతుంటారు.. నేను, నాన్న (చంద్రబాబు) ఖర్చు పెడుతూ ఉంటాం..’ అని ‘్ఫక్కి’ సదస్సులో లోకేష్ అనగానే సభికులంతా ఒక్కసారిగా నవ్వేశారు. మహిళల సమస్యలపై చాలా మంది మాట్లాడారని, పాఠశాలల విద్యార్థులకు పాలు ఇవ్వాలని కొంతమంది మహిళలు తమ ప్రసంగాల్లో చేసిన వినతిని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళతానని ఆయన చెప్పారు. టిడిపి మొదటినుంచీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ఇంట్లో, రాజకీయాల్లో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన వివరించారు. హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి ప్రసంగిస్తూ తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని, సమాజ సేవ చేయాలన్న తపన ఉందన్నారు.